: శశికళపై ఈసీకి ఫిర్యాదు చేయనున్న మైత్రేయన్?
అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై పన్నీర్ సెల్వం వర్గీయుడు వి.మైత్రేయన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయనున్నారు. అన్నాడీఎంకేకు ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడంపై ఈ రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు ఎన్నికల అధికారులను ఆయన కలవనున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదంటూ పన్నీర్ సెల్వం వర్గీయులు మొదటి నుంచి ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. కాగా, తమిళనాడు సీఎం కుర్చీ పన్నీర్ సెల్వంకు దక్కకపోవడంపై ఆయన వర్గీయులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గవర్నర్ నిర్ణయం సరికాదంటూ నినాదాలు చేస్తున్నారు.