: గవర్నర్ నిర్ణయంతో ధర్మమే విజయం సాధించింది: తంబి దురై
తమిళనాడు గవర్నర్ నిర్ణయంతో ధర్మమే విజయం సాధించిందని అన్నాడీఎంకే ఎంపీ, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అన్నారు. శశికళ వర్గానికి చెందిన పళనిస్వామిని సీఎంగా నియమించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇది ప్రజా విజయమని, రాబోయే రోజుల్లో జయలలిత ఆశయాలను ప్రజల్లోకి తీసుకు వెళతామని తంబిదురై స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పన్నీర్ సెల్వంపై ఆయన విమర్శలు చేశారు. పన్నీర్ సెల్వం పార్టీలో లేరని, ఆయనతో తమకు సమస్య లేదని చెప్పుకొచ్చారు.