: వీడిన ఉత్కంఠ... ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామికి గవర్నర్ ఆహ్వానం
అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామితో రాజ్భవన్లో ఆ రాష్ట్ర ఇన్ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు చర్చించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించారు. బలనిరూపణకు 15 రోజుల సమయం ఇచ్చారు. దీంతో తమిళనాడులో రాజకీయ సంక్షోభం ఓ కొలిక్కి వచ్చింది. ఈ రోజు సాయంత్రం పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేస్తారని అన్నాడీఎంకే పార్టీ ప్రకటించింది.
ఈ భేటీ సందర్భంగా గవర్నర్ రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉండాలని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. పళనిస్వామికి గవర్నర్ అవకాశం ఇవ్వడంతో శశికళ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ తో భేటీ అనంతరం పళనిస్వామి టీమ్ తిరిగి గోల్డెన్ బే రిసార్టుకి వెళ్లిపోయింది.