: హైదరాబాద్ లోనూ శశికళకు సొంత ఇల్లు.. ఆస్తి పన్ను బకాయి!


అక్రమాస్తుల కేసులో జైలు జీవితం గడుపుతున్న అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళకు హైదరాబాద్ లోనూ సొంత ఇల్లు ఉన్నట్లు సమాచారం. సికింద్రాబాద్-కంటోన్మెంట్ ప్రాంతంలోని వెస్ట్ మారేడు పల్లి రోడ్ లోని రాధికా కాలనీలో ప్లాటు నంబర్ 16లో శశికళ పేరిట ఓ ఇల్లు ఉంది. ఆ ఇంటి గేటుకు 'శశికళా నటరాజన్' అని నేమ్ ప్లేట్ కూడా వుంది. కాగా, గత రెండేళ్లుగా రూ.35,424 ఆస్తి పన్నుచెల్లించాల్సి ఉందని పన్ను విభాగం సూరింటెంటెండెంట్ యానీ పేర్కొన్నారు.

శశికళ 1990లో ఈ కాలనీలో రెండు డూప్లెక్స్ ఇళ్లను కొనుగోలు చేశారు. అయితే, ఒక ఇంటిని కొన్నేళ్ల క్రితం విక్రయించారు. ప్రస్తుతం ప్లాట్ నెంబరు 16లో శశికళ పేరిట ఉన్న ఇంటిలో మూడేళ్ల క్రితం అబ్రహం అనే వ్యక్తి తన కుటుంబసభ్యులతో ఉండేవారని స్థానికుల సమాచారం.  అయితే, ఈ ఇంటికి కేర్ టేకర్ గా ఉన్న ఓ వ్యక్తి, మూడు నెలల క్రితం దీనికి మరమ్మతులు చేయించి రంగులు వేయించారని స్థానికులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News