: ఆమెతో రొమాన్స్ నిజమే!: ఒప్పేసుకున్న 'వికీలీక్స్' ఆసాంజే
‘బేవాచ్’ నటి పమేలా అండర్సన్ తో వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ ఆసాంజే డేటింగ్ చేస్తున్నారంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందించాడు. ఓ రేడియో ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పమేలాతో తాను డేటింగ్ చేస్తున్నానంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనని, ఆమె అంటే తనకు చాలా ఇష్టమని, ఆమెది ఆకట్టుకునే రూపమని చెప్పిన ఆసాంజే, ఇంత కంటే ఎక్కువ వివరాలు ఇవ్వలేనని అన్నారు. పమేలా లాంటి వ్యక్తులు వారి కెరీర్ ను వారే మేనేజ్ చేసుకుంటారని ఆసాంజే అభిప్రాయపడ్డారు. కాగా, ప్రస్తుతం లండన్ లోని ఈక్వెడార్ ఎంబసీలో ఆసాంజే తలదాచుకుంటున్నారు. ఆసాంజేను కలిసేందుకు పలుసార్లు పమేలా అక్కడికి వెళ్లారు.