: వెర్రివాడిలా ఇన్నాళ్లూ ఉండిపోయా... ఇక బరిలోకి దిగుతున్నా: స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలెదుర్కొన్న శ్రీశాంత్


నాలుగు సంవత్సరాల క్రితం ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో చిక్కుకుని, అప్పటి నుంచి ఆటకు దూరమైన కేరళ బౌలర్, టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్, తిరిగి క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాడు. కేరళ క్రికెట్ సంఘం నిర్వహించే లీగ్ పోటీల్లో సత్తా చాటడం ద్వారా తిరిగి ప్రధాన జట్టులోకి రావాలని భావిస్తున్నట్టు తెలిపాడు. ఈ నెల 19న ఎర్నాకులం క్రికెట్ క్లబ్ తరఫున బరిలోకి దిగనున్నట్టు చెబుతున్నాడు.  

బీసీసీఐ గతంలో జీవితకాల నిషేధం విధించినట్టు ప్రకటించినా, అధికారిక సమాచారం ఇవ్వలేదని, తానే ఓ వెర్రివాడిలా ఇన్ని రోజులూ క్రికెట్ కు దూరమైనానని, ఇక ఆ పరిస్థితి ఉండబోదని చెబుతున్నాడు. తనపై సస్పెన్షన్ 90 రోజులు మాత్రమేనని అంటున్నాడు. కాగా, శ్రీశాంత్ మీద వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ అభియోగాలను 2015లో ఢిల్లీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. దీంతో తనపై ఎలాంటి నిషేధమూ లేదని భావిస్తున్నట్టు శ్రీశాంత్ చెబుతున్నాడు.

  • Loading...

More Telugu News