: యూసఫ్ పఠాన్ కు బీసీసీఐ ఝలక్!


భారత జట్టు క్రికెటర్, ఐపీఎల్ లో మెరుపుల ఆటగాడు యూసఫ్ పఠాన్ కు బీసీసీఐ పెను షాకిచ్చింది. హాంకాంగ్ లో జరిగే టీ-20 లీగ్ పోటీల్లో ఆడేందుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టే ఇచ్చి, దాన్ని రద్దు చేసింది. యూసఫ్ మాదిరిగానే తామూ విదేశాల్లో ఆడతామని కోరుతూ పలువురు ఆటగాళ్లు ఎన్ఓసీ కోరడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. భారత క్రికెటర్లు వేరే దేశాల లీగ్ పోటీల్లో ఆడితే, ఐపీఎల్ స్పాన్సర్లు అటు వైపు మళ్లుతారన్న ఆలోచనతోనే యూసఫ్ కు ఇచ్చిన ఎన్ఓసీని రద్దు చేసినట్టు తెలుస్తోంది. కాగా, ఎన్ఓసీ పొందిన తరువాత ఓ విదేశీ టీ20 లీగ్‌లో ఆడేందుకు డీల్ కుదుర్చుకున్న తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించిన యూసఫ్‌, కౌలూన్ కాంటాన్స్ జట్టు తరఫున ఆడేందుకు నిర్ణయించుకున్నాడు. ఇప్పుడాయన ఆశలు అడియాసలయ్యాయి.

  • Loading...

More Telugu News