: హడావుడిగా రిసార్టుకు దీపక్ వెళ్లిన అసలు కారణమిదే!
శశికళ తన మద్దతు ఎమ్మెల్యేలతో కలసి గోల్డెన్ బే రిసార్టులో ఉన్న వేళ, జయలలిత అన్న కొడుకు దీపక్ హడావుడిగా అక్కడికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన్ను పిలిపించడానికి కారణం, అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను అప్పగించేందుకేనని తొలుత వార్తలు వచ్చాయి. కానీ, అది నిజం కాదని వెల్లడైంది. జైలుకు వెళ్లాల్సిన తరుణంలో చెన్నై, ఆళ్వారుపేటలో ఉన్న పోయిస్ గార్డెన్ ప్రాంతంలోని వేదనిలయం ఇంటిని ఆయనకు అప్పగించేందుకు శశికళ నిర్ణయించుకుని, దీపక్ ను పిలిచినట్టు తెలుస్తోంది. శశికళకు మద్దతు పలికిన దీపక్, తన సోదరి దీపకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రక్త సంబంధీకుడి హోదాలో జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారా దీపక్ వార్తల్లో నిలిచారు. కాగా, ఇదే పోయిస్ గార్డెన్ ఇంటిని అమ్మ స్మారక మందిరంగా మార్చేందుకు పన్నీర్ వర్గం సంతకాల సేకరణ ఉద్యమం చేపట్టింది.