: గవర్నర్ తో ముగిసిన పన్నీర్ సెల్వం భేటీ
తమిళనాడు గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావుతో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం భేటీ ముగిసింది. పళనిస్వామితో భేటీ అనంతరం రాజ్ భవన్ అపాయింట్ మెంట్ మేరకు పన్నీర్ సెల్వం తన మద్దతుదారులతో కలిసి 8:30 నిమిషాలకు రాజ్ భవన్ కు చేరుకున్నారు. అనంతరం అరగంటసేపు ఆయన గవర్నర్ తో సమావేశమయ్యారు. సమావేశం ముగిసిన అనంతరం ఆయన నేరుగా తన నివాసానికి వెళ్లిపోయారు. భేటీ సందర్భంగా బలనిరూపణలో తనకు ముందుగా అవకాశం ఇవ్వాలని ఆయన గవర్నర్ ను కోరినట్టు తెలుస్తోంది. కాసేపట్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గవర్నర్ ఏం చేస్తారన్న దానిపై సర్వత్ర ఆసక్తి వ్యక్తమవుతోంది.