: అమితాబ్ ఇంటికి నెట్ కనెక్షన్ కట్ చేయించండంటున్న నెటిజన్లు
సోషల్ మీడియాలో పోస్టు ఒళ్లు దగ్గరపెట్టుకుని పెట్టాలి...లేని పక్షంలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా అమితాబ్ చేసిన పోస్టును తప్పుగా ఆర్ధం చేసుకున్న నెటిజన్లు దిగ్గజ నటుడిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఇస్రో సాధించిన ఘనత పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, 'ఒకే ఒక్క పీఎస్‌ఎల్వీలో 104 ఉపగ్రహాలను నింగిలోకి పంపించిన ఇస్రోకి కంగ్రాట్స్. ఇదో ప్రపంచ రికార్డ్. మనం చంద్రుడిపై దిగే రోజు వస్తుందని ఆశిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. అంతవరకు అంతా బాగానే ఉంది. ఈ ఘనత పట్ల ఆనందంతో తన కుమారుడితో కలిసి డాన్స్ చేస్తున్నట్టు ఆయన ఫోటోపెట్టారు. ఇక్కడే ఆయనను అర్ధం చేసుకోవడంలో నెటిజన్లు పొరబడ్డారు. అయితే పీఎస్ఎల్వీ ఫోటో పెట్టాలి లేదా ఇస్రో ఫోటో పెట్టాలి అలా కాకుండా అభిషేక్ తో ఆయన ఫోటో పెట్టడమేంటని మండిపడ్డారు. దీంతో 'ఎవరైనా అమితాబ్ ఇంటికి నెట్ కనెక్షన్ కట్ చేయించండి' అంటూ మండిపడ్డారు. 'సార్, అభిషేక్ కెరీర్ ను ఇస్రో కూడా గాడినపెట్టలేదు' అంటూ ఎద్దేవా చేశారు.