: లేటెస్ట్ ట్విస్ట్... పన్నీర్ సెల్వం, పళనిస్వామిలకు అపాయింట్ మెంట్ ఇచ్చిన గవర్నర్
తమిళనాట రాజకీయాలు క్షణానికో మలుపు తిరుగుతున్నాయి. నేటి సాయంత్రానికి పళనిస్వామిని ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు అన్నాడీఎంకే ప్రతినిధులమని, ముఖ్యమంత్రి అభ్యర్థులమని చెప్పుకుంటున్న ఇద్దరికీ అపాయింట్ మెంట్ ఇచ్చారు. నేటి సాయంత్రం 7:30 నిమిషాలకు వచ్చి గవర్నర్ ను కలవాలంటూ రాజ్ భవన్ పళనిస్వామిని ఆహ్వానించింది. 8:30 నిమిషాలకు గవర్నర్ ను కలవాలంటూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు ఆహ్వానం పంపారు. దీంతో తమిళనాడులో ఏం జరగనుందన్న ఆసక్తి రేగుతోంది.