: జగన్ పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నాడు: ఆనం వివేకా సంచలన వ్యాఖ్యలు


వైఎస్సార్సీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి బాగా మదించిన పిచ్చికుక్కలాగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అంతంచేయాలని జగన్ చూస్తున్నాడని మండిపడ్డారు. దురాశాపరుడైన జగన్ పిచ్చికుక్కలా ప్రవర్తిస్తున్నారని ఆయన మరోసారి విమర్శించారు. అమరావతికి రావాలంటే భయమేస్తోందని జగన్ అనడం హాస్యాస్పదమని పేర్కొన్న ఆయన, జగన్ రౌడీయిజాన్ని చూసి ప్రజలే భయపడుతున్నారని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని జగన్ అడుగడుగునా అడ్డుకుంటున్నాడని ఆయన విమర్శించారు. త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలిచి సీఎంకు కానుకగా ఇస్తామని ఆయన చెప్పారు. 

  • Loading...

More Telugu News