: శశికళతో పాటు కోర్టులో లొంగిపోయిన ఇళవరసి.. ఇక జైలులోనే మూడున్నరేళ్లు
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో జయలలితతో పాటు సహనిందితురాలిగా ఉన్న శశికళ నటరాజన్‌కు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన నేపథ్యంలో బెంగళూరుకు చేరుకున్న చిన్నమ్మ పరప్పణ అగ్రహార జైలులో ఏర్పాటు చేసిన కోర్టులో లొంగిపోయారు. ఆమె లొంగుబాటుకు సంబంధించి ప్రక్రియను లాయర్లు పూర్తిచేశారు. శశికళ వాంగ్మూలం ఇచ్చారు. న్యాయమూర్తి ఆమెను అగ్రహార జైలుకి తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆమె మూడున్నరేళ్లపాటు జైలు శిక్ష అనుభవించనున్నారు. శశికళతో పాటు సహనిందితురాలిగా ఉన్న ఇళవరసి కూడా కోర్టులో లొంగిపోయారు.