: చైనాలో పెరిగిపోతున్న 'పెళ్లికాని ప్రసాదు'ల సంఖ్య!


2050 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెళ్లి కాని ప్రసాదుల్లో అత్యధికులు చైనాలోనే ఉంటారని చైనా అకాడమీ ఆఫ్ సోషల్ సైన్సెస్ పరిశోధకుడు వాంగ్ గ్వాంగ్ ఝౌ తెలిపారు. 2050 నాటికి చైనాలో మూడు కోట్ల మంది పెళ్లికాని ప్రసాదులు ఉంటారని ఆయన అంచనా వేస్తున్నారు. 2020 నాటికి వీరి సంఖ్య 1.5 కోట్లుగా ఉంటుందని ఆయన చెప్పారు. భవిష్యత్ లో చదువులేని పురుషులకు వివాహాలు జరగడం అసాధ్యమని ఆయన చెప్పారు. చైనాలో పెళ్లి కాని యువకులు ఇప్పటికే వివిధ ఆసియా దేశాల్లోని యువతులను వివాహం చేసుకునేందుకు ఉత్సాహం చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆడ, మగ బిడ్డల మధ్య నిష్పత్తిలో ఏర్పడిన భారీ వ్యత్యాసం ఈ దుస్థితికి కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. 

  • Loading...

More Telugu News