: రోజాను మరోసారి ఎద్దేవా చేసిన ఆనం వివేకా


వ్యంగ్యంగా మాట్లాడటం, ఎద్దేవా చేయడంలో టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి శైలేవేరు. తనదైన శైలిలో సెటైర్లు వేసే వివేకానందరెడ్డి మరోసారి రోజాను లక్ష్యం చేసుకున్నారు. గతంలో రోజాపై పలు మార్లు విమర్శలు చేసిన వివేకా...నేడు నెల్లూరులో మాట్లాడుతూ, రోజా తల్లి... నోరు లేని తనపై కేసు వేసిందని అన్నారు. ఆమెను తాను పెద్దగా విమర్శించలేదని ఆయన చెప్పారు. ఆమె ఏవైనా డ్రామాలు వేయాలనుకుంటే టీవీల్లో వేయాలని, జనం ముందు వద్దని చెప్పానని ఆయన అన్నారు. గతంలో కూడా ఇలాగే రోజాను ఆయన విమర్శించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News