: బెంగళూరు పరప్పణ అగ్రహార జైలు కోర్టు వద్దకు చేరుకున్న శశికళ
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్న కేసులో శశికళ నటరాజన్‌కు సుప్రీంకోర్టు నాలుగేళ్లు జైలుశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరులోని ప్రత్యేక న్యాయస్థానంలో లొంగిపోవడానికి శశికళ రోడ్డు మార్గం ద్వారా బెంగళూరుకు చేరుకున్నారు. ఇప్పటికే బెంగళూరు కారాగారానికి ఆమె భర్త నటరాజన్‌తో పాటు పలువురు నేతలు అక్కడకు చేరుకున్న విషయం తెలిసిందే. కాసేపట్లో పరప్పణ అగ్రహార జైలు కోర్టులో శశికళ లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో ఆ జైలు పరిసరాల్లో శశికళ మద్దతుదారులు, అనుచరులు భారీగా చేరుకుంటున్నారు. పలుచోట్ల వారిని పోలీసులు అడ్డుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. శశికళ బెంగళూరులో కాలుపెట్టిన నేపథ్యంలో ఆయా పరిసర ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. జైలు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు.