: మరోసారి ట్వీట్లు సంధించిన కమల హాసన్
ప్రముఖ నటుడు కమలహాసన్ మరోసారి ట్వీట్లు సంధించాడు. ఈసారి ప్రజాస్వామ్యంపై ఆసక్తికర ట్వీట్లు చేశాడు. వాటి వివరాల్లోకి వెళ్తే... ప్రజాస్వామ్యం అనేది తన హీరో మహాత్మాగాంధీ అనుసరించినట్టు ఉండాలని సూచించాడు. ఇప్పుడున్నట్టు ప్రజాస్వామ్యానికి అవసరమైన ఫలాలుగా అవినీతి, వంచన ఉండకూడదని తెలిపాడు. ఈ సందర్భంగా థియేడర్ రూజ్ వెల్ట్ గతంలో చెప్పిన కోట్ ను ప్రస్తావించాడు... సెనేట్ లో పేరు పిల్చినప్పుడు సెనేటర్లకు 'ప్రజెంట్' అనాలో లేక 'నాట్ గిల్టీ' అనాలో కూడా తెలియదని అన్నాడు. దీనికి సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభిస్తోంది.