: వెంటనే రిసార్టుని ఖాళీ చేయండి: అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు సూచించిన పోలీసులు
తమిళనాడు అధికార పార్టీ అన్నాడీఎంకేలో ఏర్పడిన సంక్షోభం నేపథ్యంలో ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం గూటికి జారిపోకుండా శశికళ నటరాజన్ వారిని రిసార్టులో ఉంచిన విషయం తెలిసిందే. అయితే, గోల్డెన్ బే రిసార్టు గోడ దూకి, మారువేషంలో తప్పించుకొని వచ్చి పన్నీర్ సెల్వం వద్దకు చేరుకున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యే శరవణన్.. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో రిసార్టు వద్దకు చేరుకున్న పోలీసులు విస్తృతంగా సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు అక్కడ బస చేస్తోన్న ఎమ్మెల్యేలను తిరిగి తమ తమ నివాసాలకు వెళ్లిపోవాలని సూచించారు. వారి నిర్బంధంపై ఆరా తీసి, వెంటనే రిసార్టుని ఖాళీ చేయాలని చెప్పారు.
మరోవైపు బెంగళూరు ప్రత్యేక కోర్టులో హాజరుకావడానికి వెళ్లిన శశికళ మరికాసేపట్లో జడ్జిముందు లొంగిపోనున్నారు. ఈ రోజు సాయంత్రం ఆ రాష్ట్ర గవర్నర్ తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారా? లేదా? అన్న సందిగ్ధత కొనసాగుతోంది.