: దరఖాస్తు చేసుకున్న వెంటనే పాన్‌ నెంబరు


స్మార్ట్‌ఫోన్ ద్వారా ప‌న్ను చెల్లింపుల‌ను ప్రోత్స‌హిస్తోన్న కేంద్ర ప్ర‌భుత్వం.. ఇకపై మొబైల్ యాప్ ద్వారానే శాశ్వత ఖాతా సంఖ్య(పాన్‌) అందించాలని భావిస్తోంది. పాన్ పొందాల‌నుకుంటున్న వారికి సుల‌భంగా ఆ నెంబ‌రు వ‌చ్చేటట్లు మ‌రిన్ని స‌న్నాహాలు చేస్తోంది. పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న వెంట‌నే ఆ నెంబ‌రును అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ మేరకు ఆధార్ ఈ-కేవైసీ సౌకర్యం ద్వారా పాన్‌ జారీ చేయాలని భావిస్తోంది. వేలి ముద్ర ఆధారంగా పనిచేసే బయోమెట్రిక్‌ విధానంతో ఇది ప‌నిచేస్తుంది.  

ప్ర‌స్తుతం వినియోగ‌దారుల‌కు సిమ్ కార్డు జారీ చేయ‌డానికి ఉప‌యోగిస్తోన్న ప్ర‌క్రియ‌నే తాము పాన్ కార్డు జారీకి అనుసరించనున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. ఇక‌పై ద‌ర‌ఖాస్తు చేసుకున్న మూడు నిమిషాల‌కే పాన్ కార్డు పొంద‌వచ్చ‌ని చెప్పారు. మొబైల్ యాప్‌ ద్వారా పన్ను చెల్లింపులే కాకుండా పాన్ కార్డు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం, రిటర్న్‌లు ట్రాక్‌ చేసుకునే వీలు కల్పించ‌నున్నామ‌ని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News