: చంద్రబాబు నాయుడి సమక్షంలో టీడీపీలో చేరిన చెంగల్రాయుడు
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీలో చేరుతున్నట్లు ఇటీవలే ప్రకటించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ చెంగల్రాయుడు ఈ రోజు ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. విజయవాడలో చెంగల్రాయుడికి కండువా కప్పి చంద్రబాబు ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. చెంగల్రాయుడితో పాటు ఆయన అనుచరులు, మద్దతుదారులు కూడా టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ... పార్టీలో అందరూ కలిసి పనిచేస్తే టీడీపీ ని ఓడించే శక్తి ఎవ్వరికీ ఉండదని అన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ ముందుకు వెళ్లాలని సూచించారు. తెలుగు ప్రజలు అభివృద్ధి చెందాలన్నదే తన ధ్యేయమని చెప్పారు. అందరం కలిసి అభివృద్ధి సాధిద్దామని పిలుపునిచ్చారు.