: జైలుకు కూడా జయలలిత కాన్వాయ్ లోనే..!


జయలలిత చనిపోయన తర్వాత ప్రతి అడుగులోను, ప్రతి చర్యలోనూ ఆమెను తలపించేలా శశికళ నడుచుకున్నారు. చీరకట్టు దగ్గర నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలకు అభివాదం చేసే స్టైల్ వరకు జయను ఇమిటేట్ చేశారు. పోయస్ గార్డెన్ లో జయ ఉన్న ఇంట్లోకే పూర్తి స్థాయిలో మాకాం మార్చారు. ఆమె వినియోగించిన వాహనాన్నే వాడారు. చివరకు, అక్రమాస్తుల కేసులో పడిన జైలు శిక్షను అనుభవించడానికి కూడా... జయ కాన్వాయ్ లోనే బెంగళూరుకు వెళ్లారు శశికళ. కాసేపట్లో ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహారం కేంద్ర కారాగారానికి చేరుకుని, అక్కడున్న కోర్టు హాలులో జడ్జి ముందు లొంగిపోనున్నారు. 

  • Loading...

More Telugu News