: మా సినిమా చూశాక చాలా మంది వరాహ నరసింహ స్వామిని దర్శించుకున్నాకే తిరుమలకు వెళుతున్నారట!: నాగార్జున


ప్రముఖ సినీ నటుడు నాగార్జున వెంకటేశ్వరస్వామి ప్రధాన పాత్రలో నటించిన 'ఓం నమో వెంకటేశాయ' యూనిట్ తిరుపతిలో వరాహ నరసింహస్వామిని దర్శించుకుని, తిరుమలలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో నాగార్జునతోపాటు ప్రముఖ దర్శకుడు, టీటీడీ బోర్డు సభ్యుడు రాఘవేంద్రరావు, ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన ప్రగ్యాజైస్వాల్ తదితరులున్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ముందు వరాహలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకునేందుకు వెళ్లామని, అక్కడి పూజార్లు, 'ఓం నమో వెంకటేశాయ' సినిమా చూసిన తర్వాత నుంచి చాలా మంది అక్కడ పూజలు నిర్వహించిన అనంతరమే తిరుమల వెళ్తున్నారని తెలిపారని, అంతకంటే సంతోషం ఏముంటుందని అన్నాడు. 

  • Loading...

More Telugu News