: ఎవరూ చెన్నైకి రావద్దు: ఎమ్మెల్యేలకు సూచించిన స్టాలిన్
డీఎంకే ఎమ్మెల్యేల సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ ఆదేశాలు జారీ చేయడంతో ఈ భేటీ వాయిదా పడింది. అన్నాడీఎంకే పార్టీలో కొనసాగుతున్న సంక్షోభం ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే... డీఎంకే పార్టీ పరంగా ఏ నిర్ణయమైనా తీసుకోవాలని స్టాలిన్ భావిస్తున్నారు. పన్నీర్ సెల్వం వైపు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉంటారు? పళనిస్వామి వైపు ఎంత మంది ఉంటారు? అనే విషయం తేలిన తర్వాతనే తమ కార్యాచరణను ప్రారంభించాలనేది స్టాలిన్ భావన. మరోవైపు, ఇప్పటికే పన్నీర్ సెల్వం పట్ల స్టాలిన్ కొంత మేర సానుకూలంగా ఉన్నారు.