: ప్రభుత్వ ఏర్పాటుకు పళనిస్వామికి అనుమతి ఇవ్వాల్సిందే : సీఆర్ సరస్వతి
తమిళనాడు అధికార అన్నాడీఎంకే పార్టీలో ఏర్పడిన సంక్షోభం కొనసాగుతోంది. ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఇంకా ఏ నిర్ణయమూ తీసుకోని నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారన్న సందిగ్ధతకు ఇంకా తెరపడలేదు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి స్పందిస్తూ... పార్టీలో పళనిస్వామికే మెజార్టీ ఉందని చెప్పారు. గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని అన్నారు. తమిళనాడులో విపక్షాల కుట్రలు సాగవని ఆమె ఉద్ఘాటించారు.