: మరో పిటిషన్ వేసిన శశికళ


బెంగళూరులోని జైలుకు బయలుదేరిన అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్వి శశికళ... కోర్టులో మరో పిటిషన్ వేశారు. తనను సాధారణ ఖైదీగా కాకుండా, ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని పిటిషన్ లో విన్నవించారు. జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోరారు. జైల్లో ప్రత్యేక సెల్ ను కేటాయించాలని, మంచం, పరుపు, మినరల్ వాటర్, ఇంటి భోజనం, టీవీ సదుపాయాన్ని కేటాయించాలని కోరారు. వీటికి తోడు వ్యక్తిగత సహాయకురాలిని కేటాయించాలని విన్నవించారు.

మరోవైపు బెంగళూరులోని పరప్పణ అగ్రహారం కేంద్ర కారాగారం సమీపంలో 144 సెక్షన్ విధించారు. జైలు ప్రాంగణంలోని కోర్టు హాలులో శశికళ లొంగిపోనున్నారు. ఈ నేపథ్యంలో కోర్టు హాలును సిద్ధం చేస్తున్నారు. మద్యాహ్నం 3 గంటలకు జడ్జి అశ్వర్థనారాయణ కోర్టుకు రానున్నారు. 

  • Loading...

More Telugu News