: ఆ ఇద్దరు దిగ్గజాల కలబోతే కోహ్లీ: కపిల్ దేవ్


ఆకాశమే హద్దుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ అంటే కేవలం ఒక క్రికెటర్ కాదని.... ప్రపంచ దిగ్గజాలైన సర్ వివియన్ రిచర్డ్స్, సచిన్ టెండూల్కర్ ల కలబోతే విరాట్ కోహ్లి అని అన్నాడు. రానున్న రోజుల్లో ఆసీస్ క్రికెటర్ డాన్ బ్రాడ్ మన్ కంటే ముందు కోహ్లీనే కొలమానంగా తీసుకుంటారని చెప్పాడు. దక్షిణాఫ్రికా క్రికెటర్ డీవిలియర్స్ భయంకర ఇన్నింగ్స్ ఆడుతున్నప్పటికీ... టెక్నికల్ పరంగా కోహ్లీనే టాప్ అని ప్రశంసించాడు. కొన్ని సార్లు కోహ్లీ ఆటను చూస్తుంటే భయమేస్తుందని చెప్పాడు. అసాధారణ నైపుణ్యంతో పరుగుల వరద పారిస్తూ, అతి తక్కువ సమయంలోనే ఎన్నో రికార్డులను అధిగమించాడని కొనియాడాడు. కోహ్లీ ఫిట్ నెస్ కూడా అమోఘమని చెప్పాడు. క్రికెట్ ను మరో దశకు తీసుకెళుతున్న క్రికెటర్ కోహ్లీ అని ప్రశంసించాడు.  

  • Loading...

More Telugu News