: శశికళ అటు వెళ్లగానే బేరసారాలకు కదిలిన పన్నీర్ వర్గం


కోర్టులో లొంగిపోయేందుకు శశికళ, తన వర్గం ముఖ్య నేతలతో బెంగళూరుకు బయలుదేరిన తరువాత, పన్నీర్ సెల్వం వర్గం కదిలింది. ఇప్పటికీ రిసార్టులోనే ఉన్న పలువురు ఎమ్మెల్యేలను కలిసి వారు పునరాలోచించుకోవాలని కోరేందుకు పన్నీర్ సెల్వం వర్గ నేత పాండ్యరాజన్ గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. నిన్న తీసుకున్న నిర్ణయాలను పక్కనబెట్టి, పన్నీర్ కు మద్దతు పలకాలని, ఐక్యంగా ఉంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చని పాండ్యరాజన్ ఎమ్మెల్యేలకు హితబోధ చేయనున్నారని సమాచారం. పార్టీలో దివంగత జయలలిత నమ్మిన వ్యక్తి పన్నీర్ సెల్వమేనని వారికి గుర్తు చేసి, ఆయన వెనుకే నడుద్దామని పాండ్యరాజన్ కోరనున్నారు. కాగా, శశికళతో పాటు కేసులో మిగతా ఇద్దరు నిందితులైన ఇళవరసి, సుధాకరన్ లు కూడా బెంగళూరుకు బయలుదేరారు. వీరంతా సాయంత్రంలోగా ట్రయల్ కోర్టుకు హాజరై, అక్కడ లొంగిపోతున్నట్టు వెల్లడించనున్నారు.

  • Loading...

More Telugu News