: భారతదేశ ఖ్యాతిని ఇస్రో ప్రపంచానికి చాటింది: చంద్ర‌బాబు, కేసీఆర్ హ‌ర్షం


శ్రీహరికోట నుంచి ప్రయోగించిన‌ పీఎస్ఎల్వీ సీ-37 రాకెట్ విజ‌య‌వంతంగా 104 ఉపగ్రహాలనూ వాటి కక్ష్యల్లో ప్రవేశపెట్ట‌డంతో ఇస్రో శాస్త్ర‌జ్ఞుల ఘ‌న‌త‌ను ఆంధ్ర‌ప్రదేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభినందించారు. ఇస్రో సాధించిన ఘ‌న‌త భార‌తీయుల‌కు గ‌ర్వ‌కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు నాయుడు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. ఇస్రో టీమ్‌కి సెల్యూట్ చేస్తున్న‌ట్లు తెలిపారు.

ఒకేసారి 104 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిందని కేసీఆర్ పేర్కొన్నారు. రికార్డు సృష్టించి ఇస్రో దేశానికే గ‌ర్వకార‌ణంగా నిలిచింద‌ని చెప్పారు. ఇస్రో ఇలాంటి మ‌రిన్ని విజ‌యాలు న‌మోదు చేసుకోవాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు.  


  • Loading...

More Telugu News