: మరో భారీ లక్ష్యం ఛేదించే ప్రయత్నం మొదలుపెట్టిన ఇస్రో
ప్రపంచమే సెల్యూట్ చేసేలా, కొత్త చరిత్రకు నాంది పలుకుతూ ఒకేసారి 104 ఉపగ్రహాలను ప్రయోగించి విజయం సాధించిన ఇస్రో ఇప్పుడు మరో కొత్త టార్గెట్ ను పెట్టుకుంది. అంతరిక్ష ప్రయోగాల్లో తనకు తిరుగులేదని నిరూపించుకున్న ఇస్రో అదే ఉత్సాహంతో మానవసహిత అంతరిక్ష కార్యక్రమాల కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఇందుకోసం వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ కూడా ప్రారంభించింది. ఇప్పటివరకు అంతరిక్షంలోకి మానవులని పంపిన అనుభవం మన దేశానికి లేదు. భారత వైమానిక దళంతో కలిసి ఇస్రో ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం చేపడుతోంది.
ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రష్యా, అమెరికా, చైనాల సరసన భారత్ చేరుతుంది. ఖర్చును తగ్గించుకునే క్రమంలో ఇస్రో పునర్వినియోగ వాహక నౌకను రూపొందించింది. ప్రయోగాత్మకంగా శ్రీహరికోట నుంచి 65 కిలోమీటర్ల ఎత్తు వరకూ పంపి, తిరిగి వెనక్కి తెప్పించింది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మరో ప్రయోగానికి సన్నాహాలు చేసుకుంటోంది.