: పన్నీర్ సెల్వం ఇంటి ముందు రాత్రికి రాత్రే ఏర్పాటైన కొత్త బ్యానర్లు... బ్యానర్లలో కొత్త ముఖాలు
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటి ముందు రాత్రికి రాత్రే కొత్త బ్యానర్లు వెలిశాయి. బ్యానర్లపై జయలలిత, పన్నీర్ సెల్వం, ఎంజీఆర్ లతో పాటు జయ మేనకోడలు దీప ఫొటోను కూడా ఉంచారు. అంతేకాదు, అన్నాడీఎంకే పార్టీలో దీపకు కీలక బాధ్యతలను అప్పగించాలని పన్నీర్ సెల్వం భావిస్తున్నారు. జరుగుతున్న పరిణామాల పట్ల ఇటు పన్నీర్ అనుచరులు, అటు దీప అనుచరులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శశికళకు వ్యతిరేకంగా ఉన్నవారందరినీ పన్నీర్ సెల్వం తనతో కలుపుకుపోతున్నారు. ఈ క్రమంలోనే, జయ మేనకోడలు దీపకు కూడా పన్నీర్ అండగా నిలిచారు.