: జయలలిత ఆస్తులన్నీ సీజ్ చేయండి: సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు


మరణించిన జయలలిత జైలు శిక్ష నుంచి తప్పించుకుని ఉండవచ్చుగానీ, ఆమెకు విధించిన జరిమానాను రికవరీ చేసుకునేందుకు ఆస్తులు, బ్యాంకు ఖాతాలు సీజ్ చేయాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జయలలితకు ఈ కేసులో రూ. 100 కోట్ల జరిమానాను కర్ణాటక స్పెషల్ కోర్టు విధించిన సంగతి తెలిసిందే. ఆ జరిమానాను వసూలు చేసేందుకు జయలలితకు చెందిన ఆస్తులతో పాటు, సహ నిందితులు స్థాపించిన ఆరు కంపెనీల ఆస్తులనూ స్వాధీనం చేసుకోవాలని న్యాయమూర్తులు పినాకి చంద్రఘోష్, అమితవరాయ్ లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు అమలు కావాల్సిందేనని తెలిపింది.

  • Loading...

More Telugu News