: 'రారా' సినిమా ఫస్ట్‌లుక్ ను విడుదల చేసిన చిరు.. ఈ సినిమా చూడాలని ఆత్రుతతో వున్నానని వ్యాఖ్య
శ్రీకాంత్ నటించిన కామెడీ అండ్ హార్రర్ మూవీ 'రారా' ఫస్ట్‌లుక్‌ను మెగాస్టార్ చిరంజీవి ఈ రోజు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ... ఈ సినిమా చూడాలని తాను ఎంతో ఆత్రుతతో ఉన్నానని ఆయన వ్యాఖ్యానించారు. ఎప్పుడు చూడాలా అనిపిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. హాస్యం జోడించిన హార్రర్ మూవీ ఇది అని ఆయన చెప్పారు. ఈ సినిమా పిల్లలకు కూడా బాగా నచ్చుతుందని చెప్పారు. వచ్చేనెలలో ఈ సినిమా విడుదల అవుతుందని చెప్పారు. హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ తాను అడగగానే కాదనకుండా చిరు అన్నయ్య వచ్చి తన సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేశారని, ఆయనకు తాను రుణపడి ఉంటానని చెప్పారు.