: సాయంత్రానికి లొంగిపోతాను: సుప్రీంకోర్టుకు తెలిపిన శశికళ
నేటి సాయంత్రంలోగా, బెంగళూరులోని సెషన్స్ కోర్టులో లొంగిపోనున్నట్టు శశికళ సుప్రీంకోర్టుకు వెల్లడించారు. ఈ మేరకు ఆమె తరఫు న్యాయవాది, న్యాయమూర్తులకు తెలిపారు. అంతకుముందు లొంగిపోయేందుకు శశికళ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించి, వెంటనే లొంగిపోవాలని ఆదేశించగా, ఆ విషయాన్ని ఫోన్ ద్వారా శశికళకు తెలిపిన న్యాయవాది, ఆపై కోర్టు ముందు ఆమె లొంగుబాటు నిమిత్తం బెంగళూరుకు వెళుతున్నారని, పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం లేదని తెలిపారు. కోర్టు అందుకు సమ్మతించి, సాయంత్రం వరకూ గడువిస్తున్నట్టు తెలిపింది.