: ఎయిర్ ఫోర్స్ కు 'నేత్ర'... యుద్ధభూమిలో గేమ్ చేంజర్!


పూర్తి దేశవాళీ పరిజ్ఞానంతో తయారైన ఏఈడబ్ల్యూ అండ్ సీ (ఎయిర్ బార్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరాయి. బెంగళూరులో ప్రారంభమైన ఏరో ఇండియా సదస్సు సందర్భంగా రక్షణ మంత్రి మనోహర్ పారికర్, ఈ కొత్త విమానాలను లాంఛనంగా వాయుసేనకు అప్పగించారు. యుద్ధం జరిగే సమయంలో ఇవి భారత సైన్యానికి, ఓ కన్నులా పనిచేస్తాయని, శత్రు యుద్ధ విమానాలు ఎక్కడున్నాయన్న విషయాన్ని 300 కిలోమీటర్ల దూరం నుంచే పసిగడతాయని అధికారులు తెలిపారు.

వాటి అనుపానులను గుర్తించి, భారత విమానాలకు సమాచారాన్ని పంపుతాయని, ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ రాడార్, సెకండరీ సర్వైలెన్స్ రాడార్, లైన్ ఆఫ్ సైట్, డేటా లింగ్, కమ్యూనికేషన్ కౌంటర్ మెజర్స్, వాయిస్ కమ్యూనికేషన్ సిస్టమ్ లతో పాటు, శత్రువుల విమానాల నుంచి తప్పించుకునేందుకు సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్ ను ధరించివుంటాయని ప్రాజెక్టు డైరెక్టర్ సుమా వర్ఘీస్ వెల్లడించారు. విమానంపై నిలిపిన యాంటీనా బరువు 1,600 కిలోలని ఆయన తెలిపారు. గాల్లో తిరుగుతూ, భూమిపై ఉన్న విమానాలకు దూసుకొచ్చే క్షిపణులు, యుద్ధ విమానాల సమాచారాన్ని అందిస్తుందని, అవి ఏ దిశగా, ఎంత వేగంతో వెళుతున్నాయన్న విషయాన్ని కూడా తెలుపుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News