: హ్యాట్సాఫ్... ఇండియాకు సెల్యూట్ చేసిన అమెరికా!


తమ దేశానికి చెందిన 96 ఉపగ్రహాలను విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రోకు నాసా (నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్) అభినందనలు తెలిపింది. ఇంత భారీ ప్రాజెక్టును ఇస్రో శాస్త్రవేత్తలు సునాయాసంగా చేపట్టారని కొనియాడింది. ఇండియా సాధించిన ఘనతకు సెల్యూట్ చేస్తున్నట్టు నాసా అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ముందుముందు పీఎస్ఎల్వీ రాకెట్ మరిన్ని విజయాలను సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాసా నేడు చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతంకాగా, ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తల నుంచి అభినందనల వర్షం కురుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, సీఎంలు చంద్రబాబునాయుడు, కేసీఆర్, విపక్ష నేత వైఎస్ జగన్ తదితరులు ఇస్రో శాస్త్రవేత్తలకు శుభాభినందనలు తెలిపారు.

  • Loading...

More Telugu News