: జైలుకెళ్లే ముందు శశికళ నియామకాలు.. జయలలిత తీసేసిన వారికి కీలక పదవులు!
జైలుశిక్షను అనుభవించేందుకు సిద్ధమవుతున్న శశికళ, తన పనులను చకచకా చక్కబెట్టుకుంటున్నారు. అన్నాడీఎంకేలో తన పట్టు తగ్గకుండా చూసుకునేందుకు మేనల్లుళ్లను పార్టీలో భాగం చేశారు. 2011లో జయలలిత దూరం పెట్టిన టీటీవీ దినకరన్, ఎస్. వెంకటేశ్ లకు పార్టీలో పదవులు ఇచ్చారు. దినకరన్ ను పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమిస్తున్నట్టు ప్రకటించారు. తన కుటుంబంలోని వ్యక్తుల చేతుల్లోనే పార్టీ పగ్గాలు ఉండాలని భావించిన శశికళ, ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, శశికళ నేడు బెంగళూరులో కోర్టు ఎదుట లొంగిపోనున్న సంగతి తెలిసిందే.