: జయలలిత అక్రమాస్తుల కేసులో సుప్రీం తీర్పుపై సుమన్ స్పందన
అక్రమాస్తుల కేసులో దివంగత జయలలిత, ఆమె నెచ్చెలి శశికళతో పాటు మరో ఇద్దరిని సుప్రీంకోర్టు దోషులుగా ప్రకటించడాన్ని ప్రముఖ సినీ నటుడు సుమన్ స్వాగతించారు. ఈ సందర్భంగా తమిళ రాజకీయాల పట్ల స్పందించిన ఆయన... ముఖ్యమంత్రి పదవి కోసం వెంపర్లాడటం సరికాదని అన్నారు. మరోసారి ప్రజల్లోకి వెళ్లి గెలిచిన వ్యక్తే సీఎం పదవిని చేపట్టాలని అభిప్రాయపడ్డారు. కర్నూలు జిల్లా డోన్ వద్ద ఆయన నటిస్తున్న సినిమా 'సత్యా గ్యాంగ్' షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన సుమన్... మీడియాతో మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.