: నిప్పులు చిమ్ముతూ నింగికెగసిన పీఎస్ఎల్వీ-సీ37.. 104 శాటిలైట్లతో దూసుకెళ్లిన రాకెట్


భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అత్యంత  ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ37 నిప్పులు చిమ్ముతూ నింగికెగసింది. సరిగ్గా 9.28 గంటలకు శ్రీహరికోట షార్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-సీ37 టేకాఫ్ తీసుకుంది.  తనతోపాటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 104 శాటిలైట్లను నింగిలోకి తీసుకెళ్లింది. ఇందులో భారత ఉపగ్రహాలు మూడు ఉండగా, మిగిలినవన్నీ విదేశీ ఉపగ్రహాలే. వీటిలో భారత్ కు చెందిన 714 కిలోల బరువున్న కార్టోశాట్ 2డీ ఉపగ్రహం అత్యంత బరువైనది.
 
వందకు పైగా శాటిలైట్లను ఒకేసారి నింగిలోకి పంపుతున్న నేపథ్యంలో, ప్రపంచమంతా ఇస్రో ప్రయోగాన్ని ఆసక్తికరంగా పరిశీలిస్తోంది. ప్రస్తుతం తన నిర్దిష్ట మార్గంలో రాకెట్ ప్రయాణిస్తోంది. మొత్తం 104 శాటిలైట్లను వాటి నిర్దిష్ట కక్ష్యల్లో ప్రవేశపెట్టడం అత్యంత కీలకమైన వ్యవహారం. 524 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడం మొదలవుతుంది. 20 నిమిషాల తర్వాత ఉపగ్రహాలు రాకెట్ నుంచి విడిపోవడం ప్రారంభమవుతుంది.

  • Loading...

More Telugu News