: చికెన్ వండలేదని భార్యను చంపిన కిరాతకుడికి యావజ్జీవ శిక్ష
చికెన్ వండలేదన్న కోపంతో భార్యను హతమార్చిన భర్తకు యావజ్జీవ జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాదు, మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీకి చెందిన సులోచన బడేకర్(38) శంకర్‌రావు భార్యాభర్తలు. డిసెంబర్ 20, 2015న భార్య చికెన్ వండకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయిన శంకర్‌రావు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. పోలీసులు శంకర్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ఎల్బీనగర్ కోర్టు శంకర్‌రావును దోషిగా నిర్దారిస్తూ యావజ్జీవ శిక్ష విధించింది.