: ఇంకా రిసార్ట్‌లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు.. 25 మందికి అస్వస్థత


గోల్డెన్ బే రిసార్ట్.. తమిళనాడు సంక్షోభం నేపథ్యంలో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఎమ్మెల్యేలు గోడ దూకకుండా శశికళ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలను ఇక్కడికి తరలించి సకల సౌకర్యాలు కల్పించారు. శశికళను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులను తరలించేందుకు పోలీసులు ప్రయత్నించినా వారు ససేమిరా అన్నారు. ఇప్పటికీ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు అందులోనే ఉన్నారు. అయితే వీరిలో 25 మందికిపైగా శాసనసభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఇక తాము ఇక్కడ ఉండలేమని, ఇళ్లకు వెళ్లిపోతామని తోటి ఎమ్మెల్యేలతో చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈరోజు వారు రిసార్ట్ నుంచి బయటపడనున్నట్టు సమాచారం.  మరోవైపు బలనిరూపణపై నేడు(బుధవారం) గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News