: 'చాలు.. ఇకనైనా నాపై పుకారులు ఆపండి' అంటున్న టీమిండియా ఆల్ రౌండర్
ప్రేమికుల రోజును పురస్కరించుకుని తనపై పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య పిలుపునిచ్చాడు. గతేడాది అక్టోబర్ లో లిషా శర్మతో హాంగ్ కాంగ్ లో చక్కర్లు కొడుతుండగా తీసుకున్న సెల్పీని పోస్టు చేస్తూ, హార్దిక్ డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. దీంతో తాను చాలా కాలంగా సింగిల్ గా ఉన్నానని తెలిపిన పాండ్య.. కెరీర్ పై ఫోకస్ చేశానని, ఇలాంటి పుకార్లు తనపై ప్రభావం చూపవని చెప్పాడు. దీనిపై ఇదే తన చివరి అభ్యర్థన అని తెలిపిన పాండ్య, ఇకపై దీనిపై స్పందించాలని భావించడం లేదని తెలిపాడు.