: వైఎస్సార్సీపీలో చేరుతున్నాను: గంగుల ప్రభాకర్ రెడ్డి
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ టీడీపీ ఇంఛార్జి గంగుల ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైఎస్సార్సీపీ అధినేత జగన్ సమక్షంలో రేపు ఆ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా గంగుల మాట్లాడుతూ, భూమా నాగిరెడ్డిని పార్టీలో చేర్చుకుంటే రాజకీయంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని ఆనాడే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లానని, ఆరు నెలలుగా పార్టీలో ఎదురవుతున్న ఇబ్బందులను ఆయనకు చెప్పానని, త్వరలో పరిష్కరిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చినప్పటికీ ఫలితం శూన్యం అని అన్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు వేరు, ఆళ్లగడ్డలో పరిస్థితులు వేరని అన్నారు. ఇదిలా ఉండగా, తనకు ఎమ్మెల్సీ సీటు ఇవ్వాలనే షరతుపైనే గంగుల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది.