: ‘చంద్రన్న బీమా’ పథకంలో జాప్యంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం!


‘చంద్రన్న బీమా పథకం’లో జాప్యంపై సీఎం చంద్రబాబునాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. పథకం అమలు తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అధికారులపై మండిపడ్డారు. చంద్రబాబు నేతృత్వంలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశం ఈ అంశంపై వాడీవేడీ చర్చ జరిపినట్లు తెలుస్తోంది. లబ్ధిదారులకు వేగంగా సాయం అందటం లేదనే విషయాన్ని చంద్రబాబు దృష్టికి మంత్రులు తీసుకు వెళ్లారు.

ఈ విషయమై అధికారులను చంద్రబాబు ప్రశ్నించగా.. డెత్ సర్టిఫికెట్లు సకాలంలో అందకపోవడం వల్లే జాప్యం జరుగుతోందని వారు సమాధానం చెప్పారు. దీంతో, ఈ సమస్యకు వారంలోగా పరిష్కారం కనుగొనాలని అధికారులను బాబు ఆదేశించారు. ప్రతి కేసునూ ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని, పోలీస్, వైద్య, కార్మిక శాఖల సమన్వయంతో పని చేయాలని, ప్రతి కేబినెట్ భేటీలో బీమా పథకంపై సమీక్షిస్తానని సీఎం పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News