: ప్రియురాలిని ఆకట్టుకోబోయి కటకటాలపాలైన ప్రియుడు!!


వేలైంటెన్స్ డే రోజున ప్రియురాలిని ఆకట్టుకోవాలని ప్రయత్నించిన బడాబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అవాక్కయ్యాడు. ప్రేమికుల రోజును పురస్కరించుకుని ప్రియురాలి వద్దకు వినూత్నంగా వెళ్లి ఆమెను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలని భావించిన ప్రియుడు, తన కారును 2,000 రూపాయల కరెన్సీ నోట్లతో అలంకరించి, బయలుదేరాడు. ఇంకా ప్రియురాలని చేరుకోకముందే రోడ్డు మీద పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. కరెన్సీని దుర్వినియోగం చేశాడంటూ అతనిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు. దీంతో అవాక్కయ్యాడా ప్రేమికుడు. ప్రేమ ఎంతపని చేసిందంటూ లబోదిబోమంటున్నాడు! ఈ ఘటన ముంబైలో చోటుచేసుకుంది. 

  • Loading...

More Telugu News