: రిసార్ట్స్ వద్ద పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తల వాగ్వాదం


అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళను ఈ రోజు రాత్రికి తరలించే అవకాశాలు ఉండటంతో భారీగా పోలీసులు మోహరించారు. చిన్నమ్మను తరలిస్తారనే సమాచారంతో అన్నాడీఎంకే కార్యకర్తలు అక్కడికి అధిక సంఖ్యలో చేరుకున్నారు. దీంతో, పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో పోలీసులతో అన్నాడీఎంకే కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, రిసార్ట్స్ వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, పరిసర ప్రాంతాలను ఖాళీ చేయాలని ఇప్పటికే ఆదేశించామని చెప్పారు. కాగా, చిన్నమ్మను పోలీసులు తరలించేందుకు ‘రూట్’ ను క్లియర్ చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను అక్కడి నుంచి పంపే క్రమంలో వారు వాగ్వాదానికి దిగారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News