: ఎన్నికల నియమావళి ఉల్లంఘన.. రాహుల్ గాంధీపై కేసు నమోదు


ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్, ఆ పార్టీ అభ్యర్థి బ్రహ్మ స్వరూప్ బ్రహ్మచారిపై హరిద్వార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినందుకుగాను వారిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారం ముగిసినప్పటికీ రాహుల్ గాంధీ, హరీష్ రావత్, బ్రహ్మచారి రోడ్ షో నిర్వహించారని, ఈ సందర్భంగా లౌడ్ స్పీకర్లు వినియోగించారని, బైక్ ర్యాలీని నిర్వహించారని పోలీసులు తెలిపారు. దీంతో రేపు ఎన్నికలు జరగనుండగా, నేడు వారిపై కేసు నమోదు చేసినట్టు వారు వెల్లడించారు. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెల్లడించనున్నారు. 

  • Loading...

More Telugu News