: జగన్ కు త్వరలో శిక్షపడటం ఖాయం: టీడీపీ నేత సోమిరెడ్డి
శశికళపై ఉన్నటువంటి కేసులతో పాటు జగన్ కు అదనంగా 420 కేసు కూడా వుందని, జగన్ కు త్వరలో శిక్ష పడటం ఖాయమని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, తమిళనాడులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, ఆంధ్రాలో వైఎస్సార్సీపీ అధినేత జగన్.. వీళ్లిద్దరూ సీఎంలు కావాలని కలలు కన్నారని, శశికళ ఏ విధంగా నైతే డొల్ల కంపెనీలను ఏర్పాటు చేశారో, అదే మాదిరిగా జగన్ కూడా చేశారని అన్నారు. సీఎం చంద్రబాబు హీరో.. జగన్ విలన్ అని విమర్శించారు. జగన్ కు నైతికత ఉంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని, ప్రతపక్ష నేత పదవికి తక్షణం రాజీనామా చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.