: 30 నిమిషాలకు పైగా గవర్నర్ తో జరిగిన పళనిస్వామి భేటీ
అన్నాడీఎంకే శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన తమిళనాడు మంత్రి పళనిస్వామి గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయిన విషయం తెలిసిందే. గవర్నర్‌తో ఆయన భేటీ సుమారు అర్ధగంటకు పైగా జరగడం విశేషం. 128 మంది ఎమ్మెల్యేలు తనకు మద్దతుగా ఉన్నారని, ప్రభుత్వ ఏర్పాటుకు తనకు మద్దతు ఇవ్వాలని ఆయన గవర్నర్‌ను కోరారు. తనకు మద్దతు ఇస్తోన్న ఎమ్మెల్యేల లేఖను ఆయన గవర్నర్‌కి అందజేశారు. అనంతరం బయటికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఆయనతో 10 మంది మంత్రులు కూడా ఉన్నారు. ఆయన నేరుగా మళ్లీ గోల్డెన్ బే రిసార్టుకి బయలుదేరారు.