: గవర్నర్‌తో భేటీ అయిన పళనిస్వామి.. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు పన్నీర్ సెల్వం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నటరాజన్ కు సుప్రీంకోర్టు నాలుగేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పిన నేపథ్యంలో శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి గవర్నర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, తనకు అన్నాడీఎంకేలో ఉన్న మద్దతు అంశాలపై ఆయన గవర్నర్ తో చర్చిస్తున్నారు. పళనిస్వామితోపాటు మరో 10మంది రాష్ట్ర మంత్రులు గవర్నర్‌తో భేటీ అయ్యారు.
మరోవైపు పన్నీర్ సెల్వం ఈ రోజు రాత్రి రాజ్‌భవన్‌కు రానున్నట్లు తెలుస్తోంది. ఆయన గవర్నర్ విద్యాసాగర్ రావుతో భేటీ అయి ముందుగా తనకే బలనిరూపణకు అవకాశం ఇవ్వాలని కోరనున్నట్లు ఆయన మద్దతుదారులు తెలిపారు.