: ఇన్నాళ్లూ నేను పరిగెత్తాను.. ఇకపై, అందరినీ పరుగెత్తిస్తా!: చంద్రబాబు
మంత్రులు, అధికారులు.. ఏ ఒక్కరూ సరిగా పనిచేయడం లేదంటూ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. అమరావతిలో ఈ రోజు నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇన్నాళ్లూ తాను పరిగెత్తానని, ఇకపై, అందరినీ పరుగెత్తిస్తానని అన్నారు. అందర్నీ కలుపుకుని వెళ్తేనే గెలుపు సాధ్యం అవుతుందని, తాను గెలవడమే కాదు, అందరినీ గెలిపించాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. కొందరు మంత్రులు అధికారుల్లా వ్యవహరిస్తున్నారని, ఏ ఒక్కరూ సరిగా పనిచేయడం లేదంటూ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.